నాలుగేళ్ళలో ఎంత మార్పు
ఆమె తల్లి రాఖీ ఎదురు భవనంలో నివసిస్తుంది. ఆమె ఖర్చులను ప్రీతి భరిస్తుంటుంది. ప్రీతి 'మామూలు' జీవితం సాగించాలని తాను కోరుకున్నట్లు రాఖీ చెప్పింది. ఆస్కార్ ప్రతిమను ప్రీతి పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి ఆమె ఇంటి గోడకు ఇప్పటికీ వేలాడుతూ ఉన్నది. 'అదొక్కటే నాకు మిగిలింది' అని ఆమె కళ్ళలో నీళ్ళూరుతుండగా చెప్పింది.
ప్రీతి ఎలా, ఎందుకు వ్యభిచార వృత్తిలోకి దిగిందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. మైనర్ గా ఉన్నప్పుడు ఆమెను ఒక వ్యభిచార రాకెట్ లో నుంచి రక్షించి బాల నేరస్థుల గృహానికి పంపినట్లు, అక్కడి నుంచి ఆమెను రాష్ట్ర శిశు సంక్షేమ కమిటీ ఆమె తల్లికి అప్పగించినట్లు పోలీసు రికార్డులు తెలియజేస్తున్నాయి.
అత్యంత శక్తిమంతులైన వ్యక్తులకు ప్రమేయం ఉన్న పెద్ద సెక్స్ రాకెట్ లో ఆమె ఇప్పుడు భాగమని, విశాల ప్రపంచంలోకి ఆమెను వారు పారిపోనివ్వరని పోలీసులు చెబుతున్నారు. నాకెవ్వరూ లెక్క లేరనే ఆ ధీమా వెనుక స్వేచ్ఛ కోసం ఆమె పడుతున్న తపన కనిపిస్తుంది.
Pages: -1- -2- -3- 4 News Posted: 25 February, 2009
|