మళ్ళీ సంకీర్ణ సర్కారే గతి!
'సంకీర్ణాలు తప్పనిసరి చెడుగులు' అని కాంగ్రెస్ కార్యవర్గం (సిడబ్ల్యుసి) సభ్యుడు దేవేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. ఇక బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీ అయితే 'ఇటువంటి పార్టీలు దేశంలో రాజకీయ అస్థిరతను పెంచుతున్నాయి' అని అన్నారు. ఇప్పుడు ఈ రెండు పెద్ద పార్టీలు నాలుగు పెద్ద రాష్ట్రాలు తమిళనాడు, బీహార్, ఉత్తర ప్రదేశ్ (యుపి), పశ్చిమ బెంగాల్ లలో చిన్న పార్టీలుగా కొనసాగుతున్నాయి. 543 మంది సభ్యులు ఉండే లోక్ సభలో ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి 201 మందిని ఎన్నుకుంటాయి. 'ఈ నాలుగు రాష్ట్రాలలో ఇవి సొంతంగా పోటీ చేయలేని స్థితిని పరిగణనలోకి తీసుకుంటే వీటిలో ఏదీ స్వయంగా కేంద్రంలోమెజారిటీ సాధించడాన్ని కలలో కూడా ఊహించజాలదు' అని డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జోయా హసన్ అన్నారు.
జాతీయ పార్టీల వైఫల్యాలే చాలా వరకు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దోహదం చేశాయి. కాంగ్రెస్, బిజెపి అఖిల భారత పరిధిలో ప్రతిపాదిస్తున్న యంత్రాంగాలలో తమ ఆశయాకాంక్షల వెల్లడికి తగినన్ని అవకాశాలు రావడం లేదని గ్రహించిన కొన్ని సామాజిక వర్గాలు సరికొత్త ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాయి.
'కాంగ్రెస్ వంటి పార్టీలు తమ వ్యవస్థ పరిధిలో శక్తిమంతులైన స్థానిక నాయకులను ఎదగనవ్వడం లేదు కనుక జాతీయ పార్టీ ఛత్రంగా ఉండడమనే సిద్ధాంతం కొరగాకుండా పోయింది' అని ముంబైకి చెందిన రాజకీయ విశ్లేషకుడు బి. వెంకటేష్ కుమార్ వ్యాఖ్యానించారు. భారత రాజకీయ వ్యవస్థలో పార్టీలు చీలికలు పేలికలు కావడానికి కుల, భాష దురభిమానాలు ప్రధాన కారణాలయ్యాయి. 1967 నుంచి ఎన్నికలలో తమిళనాడులో ద్రవిడ పార్టీలు బలమైన శక్తులుగా ఆవిర్భవించడంతో ఇందుకు నాంది పడింది.1990 దశకం నాటికి కుల ఆధారిత పార్టీలు దేశంలోని అత్యధిక ప్రాంతాలోఆధిపత్యం చెలాయించనారంభించాయి.
Pages: -1- 2 -3- News Posted: 4 March, 2009
|