మళ్ళీ సంకీర్ణ సర్కారే గతి!
ఆర్థిక సరళీకరణ విధానాల పర్యవసానంగా ఆకర్షణీయ రీతిలో దేశంలో సాగిన ఆర్థిక వృద్ధి ఫలాలు సమానంగా పంపిణీ కాకపోవడంతో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా చిన్న చిన్న పార్టీలుగా చీలిపోసాగాయి. విచిత్రమేమిటంటే చిన్న చిన్న పార్టీలు కూడా క్రమంగా కాంగ్రెస్ వైపు లేదా బిజెపి వైపు మొగ్గు చూపడం. దీనితో దేశం దాదాపుగా రెండు పార్టీల వ్యవస్థ దిశగా సాగుతున్నది. దేశంలో తృతీయ ఫ్రంట్ అనేది సంఖ్యాపరంగా అసాధ్యంగా తయారైందని పేరు వెల్లడికి ఇష్టపడని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అంగీకరించారు.
'బిజెపి, కాంగ్రెస్ లేకుండా మిగిలిన పార్టీలన్నీ కలిపి 272 సీట్లు సాధించలేవు. అందువల్ల ఆ రెండింటిలో ఒకటి లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరదు' అని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండింటికీ ఈ సంగతి తెలుసు. ఈ పరిస్థితిని తమకు అవకాశంగా ఉపయోగించుకోవాలని అవి కోరుకుంటున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 4 March, 2009
|