సామాజిక సేవలో తిపిర్నేని
ఈ నేపథ్యంలో తానాలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలను నిరోధానికి నడుంబిగించాలన్న పట్టుదల తిరుమల రావులో పెరిగింది. తానా కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో తిపిర్నేని కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో దిగారు. 'నిజాయితీ', 'సమైక్యత', 'నిస్వార్ధ సేవ' అనే మూడు ప్రధాన అంశాలతో తాను తానా ఎన్నికల బరిలో నిలబడినట్లు చెప్పారు. సంస్థను నిజాయితీగా నడిపించడం, తెలుగువారిలో సమైక్యతా భావాన్ని పెంపొందించడం, అమెరికాలోని తెలుగువారికి నిస్వార్థంగా సేవచేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు.
'తానా ప్రధాన లక్ష్యాలపై మళ్ళీ దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఇదే'.
'తానాలో సమతూకం సాధించాల్సిన, 'సరైన శక్తిని, నాయకత్వాన్ని సమకూర్చాల్సిన సమయం ఇదే'
'ప్రతి ఒక్కరితో సామరస్య పూర్వకంగా కలిసి పనిచేస్తూ, తెలుగువారందరినీ సంఘటిత పరచాల్సిన సమయమూ ఇదే' అనేవి తిపిర్నేని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
అలాగే, అమెరికాలోని తెలుగువారి బాగోగులకోసం తానా ఏర్పాటైన విషయాన్ని మరచిపోయి ప్రస్తుత నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలోని వర్తమాన రాజకీయాలు, త్వరలో జరగనున్నఎన్నికలపై స్వార్థపూరిత ఆలోచనలతోనూ, వ్యక్తిగత ఎజెండాలతోను దృష్టి కేంద్రీకరిస్తున్నదని తిరుమల రావు తప్పుపడుతున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 23 March, 2009
|