సామాజిక సేవలో తిపిర్నేని
న్యూజెర్సీ : మూడు దశాబ్దాల క్రితం ఉత్తర అమెరికాలో ఎక్కడెక్కడో నివాసం ఉంటున్న తెలువారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు అవిరళ కృషిచేసిన వారిలో తిరుమల రావు తిపిర్నేని ఒకరు. అమెరికాలోని తెలుగువారి సంక్షేమం కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములైన తిరుమల రావు అంటే తెలియని ప్రవాసాంధ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉత్తర అమెరికా నగరం న్యూయార్క్ లో 1977లో నిర్వహించిన మొట్టమొదటి తెలుగు సంఘం సమావేశానికి తిపిర్నేని కార్యదర్శిగా విశేష సేవలందించారు. తద్వారా ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వ్యవస్థాపనలో తిపిర్నేని కూడా ముఖ్య భూమిక పోషించారు.
తానా ఏర్పాటు, నిర్వహణ కోసం తమ సమయాన్ని వెచ్చించిన పలువురిలో ఒకరిగా తిరుమల రావు తిపిర్నేని మనస్సును ఇటీవలి కాలంలో తానాలో చోటుచేసుకున్న పలు అవాంఛనీయ సంఘటనలు తీవ్రంగా బాధించాయి. తాము విత్తు వేసి, పాదు చేసి, మొక్కను పెంచి, మహా వృక్షంలా విస్తరింపజేసిన తానాలో భేదాభిప్రాయాలు తలెత్తడం, వర్గాలుగా విడిపోయి కోర్టులకు ఎక్కడంతో ఆందోళన చెందారు. త్వరలో జరగనున్న తానా మహా సభల నిర్వహణ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా తెలుగువారి సంక్షేమం కోసమే కూడబెట్టిన లక్షలాది డాలర్లను కోర్టు వ్యాజ్యాల కోసం దుబారా చేయడం ఆయనను బాధించాయి. ఇలాంటి భేదాభిప్రాయాలను తానాలోనే అంతర్గతంగా చర్చించుకొని సమసిపోయేట్లు చేసుకోకుండా అల్లరిపాలవడం తిపిర్నేనికి తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయి.
Pages: 1 -2- -3- News Posted: 23 March, 2009
|