సామాజిక సేవలో తిపిర్నేని
ఇలాంటి పలు కారణాలు తిరుమల రావు తిపిర్నేనిని తానా కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడాలన్న దృఢ నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేశాయి.
తిపిర్నేని సామాజిక సేవలు - పొందిన అవార్డులు :
1976 : న్యూజెర్సీలో తెలుగు పాఠశాలను ప్రారంభించారు
1977 : ఉత్తర అమెరికా నగరం న్యూయార్క్ లో జరిగిన తొలి తెలుగు సమావేశానికి కార్యదర్శిగా ఇతోధిక సేవలు అందించారు
1977 : 'ఎ.పి. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్' పేరుతో 1977లో తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో పాల్గొన్నారు
1978 - 79 : న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (టిఎల్ సిఎ) అధ్యక్షునిగా వ్యవహరించారు
2000 - 01 : టిఎల్ సిఎ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ గా సేవలందించారు
1999 - 2007 : తానా ఫౌండేషన్ విజయవంతంగా నిర్వహించిన వాక్సినేషన్, పారిశుధ్యం పథకాలు, మంచినీటి సరఫరా పథకాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, హెచ్ ఐ వి\ ఎయిడ్స్, కంటి జబ్బుల చికిత్సా శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించారు.
2005 - 07 : తానా ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరించారు
2008 : కమ్యూనిటీకి అందించిన సేవలకు గాను అవార్డును తిరుమల రావు తిపిర్నేని అందుకున్నారు.
తిరుమల రావు తిపిర్నేని వ్యక్తిగత వివరాలు :
కృష్ణా జిల్లాలోని గుడివాడలో పుట్టి, పెరిగిన తిరుమల రావు తిపిర్నేని సొంత పట్టణంలోనే ఉన్న ఎ.ఎన్.ఆర్. కళాశాలలో బిఎస్సీ పూర్తిచేశారు. నాగపూర్ లోని వి.ఆర్.సి.ఇ. కళాశాల నుంచి బి.ఇ. పట్టా తీసుకున్నారు. స్టీవెన్స్ టెక్ లో ఎమ్మెస్ తీసుకున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీకి రంగంలో సొంత వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తిరుమలరావు గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించిన డాక్టర్ పావని (ఈడుపుగంటి)ని వివాహం చేసుకున్నారు. తిరుమలరావు, పావని దంపతులకు రేణుక, అనిత అనే కుమార్తెలు, విజయ్ కుమారునికి జన్మనిచ్చారు.
అందరం కలిసికట్టుగా ఉండి తెలుగువారి బాగోగుల కోసం తెలుగువారే ఏర్పాటు చేసుకున్న తానాలో కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం ద్వారా ఉత్తర అమెరికాలోని భవిష్యత్ తరాల తెలుగువారికి మరింత విస్తృతమైన సేవలు చేయాలన్న దృఢ సంకల్పంతో తిరుమల రావు తిపిర్నేని ఉన్నారు. తానా సభ్యులు తమ విలువైన ఓటు వేయడం ద్వారా తనకు మద్దతు ఇవ్వాలని, తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని తిరుమల రావు కోరుకుంటున్నారు. బ్యాలట్ పేపర్ల ను వచ్చే ఏప్రిల్ 4వ తేదీ లోగా మెయిల్ చేయాలని తిరుమల రావు విజ్ఞప్తి చేశారు.
Pages: -1- -2- 3 News Posted: 23 March, 2009
|