తగ్గిన 'తానా' ఎంట్రీ ఫీజు
ఇక వృత్తి ఉద్యోగాలలో అలసిపోయిన వారికి సాంత్వన కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తున్న ఆధ్యాత్మిక రంగానికి కూడా తానా 17వ సభలలో మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీనివాస కల్యాణం, సీతారామ కల్యాణం నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. `ఆర్ట్ ఆఫ్ లివింగ్' నిర్వాహకుడు రవిశంకర్ ఈ సమావేశాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. అమెరికాలో భారత సంప్రదాయాల దూతగా పేరుగాంచిన రాజీవ్ మల్హోత్రా ఆధ్యాత్మిక సదస్సులలో ప్రధానోపన్యాసం చేయనున్నారు. హిందూ దేవాలయ పరిరక్షణ సమితిని ఏర్పరచి ఆంధ్రదేశంలో ఆలయాల పవిత్రతను కాపాడేందుకు నడుంబిగించిన స్వామి కమలకుమార్, శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందస్వామి, చిన్మయ మిషన్ ప్రతినిధి స్వామి చిదాత్మానంద, విశ్వయోగి విశ్వంజీ తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగించనున్నారు.
ప్రతిసారి మాదిరిగానే ఈ పర్యాయం కూడా సినిమా రంగం పెద్దపెద్ద తారలు దిగివస్తున్నారు. ఎస్.పి. బాలసుబ్రమణ్యం, మురళీమోహన్, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి గోపాలకృష్ణ, ఇలియానా, అనుష్క, భూమిక, రఘుబాబు, ఉత్తేజ్, సుమ, రాజీవ్ కనకాల, మనో తదితరులు సభలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం 'జీవితకాల సాఫల్య పురస్కారం' అందుకోనున్నారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సారథ్యంలో ప్రత్యేక సంగీత విభావరి జరుగుతుంది. తెలుగు సంస్కృతి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సుప్రసిద్ధ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన గేయానికి అమెరికా నలుమూలల నుంచి ఎంపిక చేసిన వంద మంది చిన్నారులు చేసే నృత్యం సభల ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
Pages: -1- -2- 3 -4- News Posted: 22 June, 2009
|