సంగీత సాహిత్య సమ్మేళనం
టాన్‌టెక్స్ అధ్యక్షుడు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ నాయకత్వంలో నెలానెలా తెలుగు వెన్నెల సాహిత్యవేదిక సమన్వయకర్త మల్లవరపు అనంత్ కార్యదక్ష ప్రతిభతో, టాన్‌టెక్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కన్నెగంటి చంద్రశేఖర్ నేతృత్వంలో, తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ తోటకూర ప్రసాద్ సహయ సహకారాలతో, స్థానిక వ్యాపారవేత్తల ఉదాత్త విరాళాలతో, ఎందరో కరసేవకుల శ్రమదాన ఫలితంతో, అంతమంది ప్రముఖులకూ, దాదాపు 1200 మందికి పైగా విచ్చేసిన టాన్‌టెక్స్ సభ్యులకూ ఆతిథ్యంలో ఎలాంటి లోటూ లేకుండా, అందరినీ ఆకట్టుకొనే రీతిలో సాహిత్య, సంగీత నృత్య వినోదాల్ని సమర్పించి, టాన్‌టెక్స్ చరిత్రలోనే ఒక మైలురాయిలా నిలిచేలా అత్యద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతమైంది.
కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరూ అసలు ఇలాంటి కార్యక్రమం తలపెట్టాలన్న తలంపు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరికీ రాదని, వచ్చినా ఇంత గొప్పగా నిర్వహించడం అనితర సాధ్యం అని స్పందించారు. టాన్‌టెక్స్ సంస్థ ఈ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రశంసార్హమైందని కొనియాడారు.
మా తెలుగుతల్లి ప్రార్థనాగీతంతో, జ్యోతి ప్రజ్వలనతో సంప్రదాయ బద్ధంగా ప్రారంభమైన ఈ మహాసభలో మొదటిగా బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు, 'తెలుగు సినిమా నాడు-నేడు' అనే అంశంతో ఆనాటి సాహిత్య చర్చకు శక్తివంతమైన ప్రసంగంతో శ్రీకారం చుట్టారు. తర్వాత జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవేశపూరితమైన, సుమధురమైన గళంతో పాటలు పాడి, 'పనీ-పాట', హుళక్కి వేదాంతాన్ని, పల్లెసీమల అందాల్ని చక్కగా అందిచారు. మహాకవి శ్రీశ్రీ సతీమణి శ్రీమతి సరోజ శ్రీశ్రీ తన భర్త ఆదర్శాలను ఆయన కవితల్లోని గుప్తధనాన్ని మళ్ళీ శ్రీశ్రీ అభిమానులందరికీ గుర్తుతెచ్చారు. ప్రజాసాహితీ సంపాదకుడు, సమీక్షకుడు వాసిరెడ్డి నవీన్ ప్రసంగిస్తూ, తెలుగు కథా వైభవాన్ని అందరికీ చవిచూపించారు. జస్టిస్ టి. గోపాలకృష్ణ తర్వాత టాన్‌టెక్స్ సాహిత్య వేదిక సమర్పించే 'తెలుగు వెలుగు' పత్రిక, ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 14 July, 2009
|