సెహగల్ మ్యూజికల్ షో
విశాఖపట్నం: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు బాబా సెహగల్ మ్యూజికల్ షో నిర్వహించనున్నట్లు వెల్పేర్ గ్రూఫ్ సంస్థ అధినేత మళ్ల విజయ్ ప్రసాద్ తెలిపారు. హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఐపీఈఆర్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఈనెల 13, 14 తేదీలలో 'గమ్యం - ది స్టూడెంట్ డెస్టినేషన్' పేరుతో ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎడ్యుకేషన్ ఫెయిర్, సాయంత్రం నాలుగు గంటల నుంచి అంతర కళాశాలల డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు బాబా సెహగల్ మ్యూజికల్ షో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ షో పోస్టర్ ను విడుదల చేశారు. కాంప్లిమెంటరీ పాస్ లు కోసం ఐఐపీ ఈఆర్ బిజినెస్ స్కూల్ ఆఫీస్, వెల్ఫేర్ సంస్థలలోగాని పొందవచ్చన్నారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత శ్రీధర్ రెడ్డి, మూన్ పవర్ ఈవెంట్ మేనేజర్ శ్రీనివాస్, బిజినెస్ స్కూల్ ప్రతినిధులు శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
News Posted: 12 February, 2009
|