శ్రీకాకుళం: పంచాయితీరాజ్ శాఖలో పాలకొండ మండల ఇంజనీర్ వెంకటేశ్వరరావు 30 లక్షల రూపాయలు నాసిరకం పనులు చేసి స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. 30 లక్షల రూపాయలు విలువచేసే రోడ్లుగా చెప్పుకుంటున్న రోడ్ల నిర్మాణానికి కేవలం ఐదు లక్షల రూపాయాలు కూడా ఖర్చు కాలేదని తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మండల ఇంజనీర్ సిద్ధపడటంపై స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పాలవలస రాజశేఖరం ఆయనపై విరిచుకుపడినట్లు తెలిసింది.