పేలిన లాండ్ మైన్
శ్రీకాకుళం : ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఎఓబి) మావోయిస్టులు మళ్ళీ తమ ప్రతాపం చూపించారు. మందుపాతరతో పోలీసు వాహనాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించారు. కాని గురి తప్పడంతో సుమారు 22 మంది ఒరిస్సా పోలీసులు ప్రాణాలతో బయట పడ్డారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివారాల్లోకి వెళితే... ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి-రాయగడ జిల్లాల సరిహద్దుల్లో వడబ జంక్షన్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు సోమవారం మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడబకు 20 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఒక వాహనంలో 22 మంది పోలీసులు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వాహనం కల్వర్టుకు రాకముందే మందుపాతర పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కల్వర్టు శ్లాబ్ దాదాపు 40 అడుగుల ఎత్తుకు ఎగిరి వాహనంపై పడడంతో అశోగునియా, రంజిత్ రౌతులు అనే సి.ఆర్.ఎఫ్. జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో పదిమంది స్వల్పంగా గాయపడడంతో వీరిని గజపతి జిల్లా మోహన్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.
News Posted: 16 February, 2009
|