ఆర్టీసీ బస్సు దోపిడీ
విశాఖపట్నం : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో దుండగులు బుధవారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డారు. మావోయిస్టుల పేరుతో ఈ దోపిడీ చేశారు. సీలేరు సమీపంలోని బత్తులూరు వద్ద ఈ దోపిడీ జరిగింది. బస్సును ఆపి, ప్రయాణికులను మారణాయుధాలతో బెదరించిన ఆగంతకులు తమ పనిని సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. దోపిడీ జరిగిన సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముందుగా ప్రయాణికుల వద్ద ఉన్న సెల్ ఫోన్ లను తీసేసుకున్న ఆగంతకులు వారి నుంచి నగదు, నగలు, కండక్టర్ వద్ద ఉన్న సొమ్మును దోచుకున్నారు. దోపిడీ అనంతరం దుండగులు బస్సు దిగి వెళ్లిపోతూ మావోయిస్టుల పేర ఒక లేఖను కండక్టర్ చేతిలో పెట్టి పరారయ్యారు.
News Posted: 18 February, 2009
|