కలెక్టరేట్ కు తాళం
విశాఖపట్నం : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం ఎబీసీడీ వర్గీకరణ జరిగేవరకు ఆందోళన విరమించేది లేదంటూ విశాఖ కలెక్టరేట్ కు తాళం వేసి, ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News Posted: 19 February, 2009
|