విజయనగరం : విజయనగరంలోని సుందరయ్య కాలనీలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఐదు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాధమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.