సెక్షన్ ఇంజనీర్ హత్య
విశాఖపట్నం : విధుల నుంచి తొలగించిన సెక్షన్ ఇంజనీర్ తనను మళ్ళీ విధుల్లోకి తీసుకోలేదన్న అక్కసుతో ఓ కలాసీ హంతకుడిగా మారిన వైనం ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రైల్వే సెక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రామకృష్ణను అతని కింద పనిచేస్తున్న కలాసీ రమణయ్య ప్రవర్తన బాగోలేదని విధుల నుంచి తొలగించాడు. దీనితో కక్ష పెంచుకున్న రమణయ్య ఇంజనీర్ రామకృష్ణను దారుణంగా హతమార్చి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద మృతదేహాన్ని పడేశాడు. ఈ సంఘటనతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర కలకలం చెలరేగింది.
కాగా, రామకృష్ణను హతమార్చిందెవరన్నది ముందుగా మిస్టరీగా ఉన్నప్పటికీ పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. రామకృష్ణ హత్యకు రమణయ్యే బాధ్యుడని వారు కనుగొన్నారు. రమణయ్య ప్రవర్తన బాగోలేదని విధుల నుంచి తొలగించడంతో రమణయ్యే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. రమణయ్యను తమదైన శైలిలో ఇంటరాగేషనే చేయడంతో తప్పు ఒప్పుకున్నాడు.
News Posted: 26 February, 2009
|