విశాఖపట్నం : విశాఖ జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు ఓ హోంగార్డ్ ను కాల్చి చంపారు. ఈ సంఘటనలో మరో హోంగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో మావోయిస్టులు ఈ ప్రాంతంలో తమ ఉనికిని సజీవంగానే ఉంచుకున్నట్లు ప్రభుత్వానికు గుర్తు చేసినట్లైంది. హోంగార్డును మావోయిస్టులు కాల్చివేసిన సంఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.