బంగారు పతకాల శ్రీవాణి
విజయవాడ : గవర్నర్ పేటలో డా.నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో చదువుతున్న శ్రీవాణి పరీక్షల్లో బంగారు పతకాలు సాధించింది. 2007 బి.ఎ.ఎం.ఎస్.లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను డా.పిల్లా ఎల్లయ్య స్మారక బంగారు పతకం, కాయకల్ప చికిత్సలో అత్యధిక మార్కులు సంపాదించినందుకు, పండిత ముక్కామల వెంకటశాస్త్రి స్మారక బంగారు పతకం, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ డివిజన్ లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణురాలైనందుకు డా.అచ్యుత లక్ష్మీపతిరావు పతకం కూడా ఈమె సాధించింది. మార్చిలో జరిగే ఎన్.టి.ఆర్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో ఈ మూడు అవార్డులు అందుకోనున్నారు.
News Posted: 3 March, 2009
|