రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి
విజయవాడ : బుధవారం మధ్యాహ్నం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు వద్ద పెళ్ళి బృందంతో వెళుతున్న మినీ వ్యాన్, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. నర్సాపురం నుంచి పెళ్ళి బృందం ఉయ్యూరు వస్తున్నారని సమాచారం.
News Posted: 4 March, 2009
|