షికాగో తెలుగు సంఘం ఏర్పాటు
షికాగో : షికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఏ) ఫిబ్రవరి 28న ఇక్కడ ప్రారంభమైంది. సిటిఏ సంస్థను షికాగోలో భారత రాయబారి అశోక్ కుమార్ అత్రి స్థానిక బాలాజీ ఆలయం ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారని సంస్థ వ్యవస్థాపకుడు రావు ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు. షికాగో తెలుగు అసోసియేషన్ ప్రారంభ సూచకంగా సంస్థ లోగోను, బ్యానర్ ను ఆవిష్కరించి, సంస్థ పేరును ప్రకటించారని అశోక్ కుమార్ రావు పేర్కొన్నారు. సుమారు 7 వందల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువత అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారని ఆయన వివరించారు.
ప్రవాస తెలుగు కుటుంబాలలోని చిన్నారులు ఆలపించిన 'మా తెలుగు తల్లికీ మల్లెపూదండ' ప్రార్ధనాగీతంతో సిటిఏ ప్రారంభ కార్యక్రమం మొదలైంది. అనంతరం స్నేహ కోడూరి శాస్త్రీయ నృత్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రావు ఆచంట అధ్యక్షత వహించారు.
ప్రవాస తెలుగు ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటైన కొత్త సంస్థ షికాగో తెలుగు అసోసియేషన్ ను అశోక్ కుమార్ అత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావడాన్ని ఆయన ఆహ్వానించారు. సిటిఏ సంస్థకు షికాగోలోని భారత రాయబార కార్యాలయం నుంచి వీలైనంత మేరకు సాహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంస్థ ప్రారంభ కార్యక్రమంలో భాగంగానే అశోక్ కుమార్ అత్రి సిటిఏ 'థీమ్ సాంగ్'ను, పద్యాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ పద్యాన్ని ప్రముఖ తెలుగు గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గానం చేశారు. ఈ పద్యంలో తెలుగు వైభవం, తెలుగు జాతి సంస్కృతి, తెలుగు జాతి ఔన్నత్యాన్ని అమెరికాలో మరింత విస్తృతం చేయడంలో యువత పాత్ర గురించి మంచి భావం వచ్చేలా రచించారు.
అమెరికాలో తెలుగు ప్రజలకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన యువత ఔదార్యాన్ని డాక్టర్ రఘురామ్ వీరమాచనేని ప్రశంసించారు. షికాగో తెలుగు అసోసియేషన్ కు తన వంతుగా చేయాల్సినంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. షికాగో తెలుగు అసోయేషన్ లక్ష్యాల గురించి ఆ సంస్థ వ్యవస్థాపకుడు రవి ఆచంట వివరించారు. తెలుగు వారికి తాము సంస్థ ద్వారా అందించే సేవల గురించి తెలిపారు. సిటిఏ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రవీణ్ మోటూరు కూడా తమ ఆలోచనా విధానాలను పంచుకున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 6 March, 2009
|