విశాఖపట్నం : వేసవి వచ్చీ రావడంతోనే తాగు నీటి ఎద్దడి మొదలయ్యింది. తాగేందుకు నీరు అందక మహిళలు నానా ఇబ్బందులు పడుతూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. తాగు నీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రేటర్ విశాఖ కమిషనర్ ఛాంబర్ ముందు మహిళలు శనివారం ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు.