విశాఖపట్నం : కల్వర్టు కింద దాచి పెట్టిన నాలుగు మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టులు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని దుశ్చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందనే అనుమానంతో విశాఖపట్నం జిల్లాలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాలుగు మందుపాతరలు లభ్యం కావడంతో మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.