ఆరోగ్యశ్రీకి అడ్డుకాదు: నారాయణ
విశాఖపట్నం : రాష్ట్రంలోని పేదలకు సౌకర్యంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయాలంటూ తాను ఎన్నికల కమిషన్ ను కోరలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వివరణ ఇచ్చారు. అయితే, 104, 108 వాహనాల ద్వారా అధికార పార్టీ అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, వాటిపై నిఘా పెట్టాలంటూ మాత్రమే తాను సీఈసీకి విజ్ఞప్తి చేశానన్నారు. శనివారంనాడు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
News Posted: 14 March, 2009
|