నగలు చోరీ
విశాఖపట్నం : స్థానిక ఆమంచివారి వీధిలో భాష్యం స్కూలుకి ఎదురుగా ఉన్న ఇంట్లో 10 తులాల బంగారు నగలు దొంగలు దోచుకెళ్ళారు. రిటైర్డ్ లెక్చరర్ గుండా వీరభద్రరావు, ఆయన భార్య టీచర్ సీత ఆ ఇంట్లో వుంటున్నారు. నిద్ర లేచిన సీతకు తన కాలికి బంగారు గాజులు తగలడంతో విస్తు పోయిన ఆమె భర్తను లేపింది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి చూడగా బీరవాలు తెరిచి అందులో వుండవలసిన బంగారు ఆభరణాల పెట్టెలు, చిందరవందరగా కొన్ని నగలు కిందపడి వుండగా మరి కొన్ని నగలు మాత్రం కనిపించలేదు. వీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్.ఐ.వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలన్నింటినీ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 21 March, 2009
|