విశాఖపట్నం : నటుడు శివబాలాజీ దంపతులు సింహాద్రి నాథుడ్ని దర్శించుకుని నిత్యకల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సింహగిరిలో శివబాలాజీ దంపతులు ప్రత్యేక ఆకర్ణగా నిలిచారు. వీరు స్వామి వారి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ తనకు దైవభక్తి ఎక్కువన్నారు. త్వరలో టార్గెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. చిత్రసీమకు చెందిన తామిద్దరూ భార్యాభర్తలు కావడం పూర్వజన్మ సుకృతమని నటి మధుమిత అన్నారు.