విశాఖపట్నం : భారత నావికాదళ సాయుధ సామాగ్రిలో మరో రెండు అత్యాధునిక నేవీ ఫ్లైట్లు చేరాయి. ఎంతో శక్తివంతమైన ఐ.ఎన్.ఎస్ జలాశ్వల్లాంటి హెలికాప్టర్ వాహన నౌకలను మొహరించిన నౌకాదళం తాజాగా రెండు వైమానికి స్క్వాడ్రన్ లను ఒకేసారి ప్రారంభించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ఫ్లాగ్ ఆపీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్.ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైఎస్ అడ్మిరల్ నిర్మల్ ఐ.ఎన్.ఎస్.డేగాలో వీటిని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నావికాదళ సిబ్బంది మరింత అకింత భావంతో పనిచేయాల్సి ఉందన్నారు. ప్రమాద స్థలానికి రిస్క్యూ బృందంతో పాటు అవసరమైన వస్తువులను సైతం సుదూర ప్రాంతాలకు తీసుకువేళ్ళే సామర్థ్యం వీటికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నావికాదళ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.