మారుతి కారు బోల్తా
విజయవాడ : కృష్ణాజిల్లా దొనకొండ సమీపంలో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా, వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి విజయవాడకు మారుతీ కారులో వస్తుండగా లారీని తప్పించబోయి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News Posted: 26 March, 2009
|