విశాఖపట్నం : ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాను ప్రదర్శిస్తున్న ధియేటర్లో టిక్కెక్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందారు. కంచెరపాలెంలో వున్న ఊర్వశి ధియేటర్లో టిక్కెట్లు తీసుకునేటప్పుడు తొక్కిసలాట జరగడంతో కామేష్ (19) అనే యువకుడు మరణించినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఈ సంఘటన వెలుగుచూసింది.