నాగబాబు రోడ్ షో
విశాఖపట్నం : మెగా బ్రదర్ నాగబాబు ప్రజారాజ్యం పార్టీ తరపున రోడ్ షోలు నిర్వహించడానికి శ్రీకాకుళం జిల్లా రానున్నారని అధికార ప్రతినిధి పేడడ పరమేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని రాజాం, పాలకొండ, పాతపట్నం, ఆముదాల వలసు, నాగబాబు రోడ్ షోలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. నాగబాబు పర్యటన రాజాం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి వరకు కొనసాగుతుంది.
News Posted: 7 April, 2009
|