గుంటూరు : ఈసీ మేరుగ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మేరుగ నాగార్జున సమర్పించిన అఫిటవిట్ లో ఆయనపై ఉన్న కేసుల వివరాలను గోప్యంగా ఉంచారని ప్రత్యర్థులు అభ్యంతరం లేవనెత్తడంతో ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు స్క్రూటినీని మంగళవారానికి వాయిదా వేసింది. నామినేష్ ను పరిశీలించిన తదుపరి ఈసీ మేరుగ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా వేమూరు కాంగ్రెస్ అభ్యర్థి మేరుగ నాగార్జున నామినేష్ పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలుపుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.