విశాఖలో రాహుల్ పర్యటన
విశాఖపట్నం : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డితో కలిసి ఆయన విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. రాహుల్ ఒరిస్సానుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు విశాక పోర్టు స్టేడింకు చేరుకుంటారు. తదుపరి అనాకపల్లిలో సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం విశాఖ పోర్టు స్టేడియంకు వచ్చి సాయంత్రం 5 గంటలకు ఎంవీపీ కాలనీలోని ఎఎస్ రాజా కళాశాల మైదనాంలో నిర్వహించే బహిరంగసభకు హాజరవుతారు. రాహుల్ రాకను పురస్కరించుకొని ఆయనకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News Posted: 8 April, 2009
|