వైభవంగా దుర్గామల్లేశ్వరల కల్యాణం
విజయవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిలో చైత్ర మాస బ్రహ్మోత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత శ్రీ దుర్గామల్లేశ్వరుల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో అమ్మవారి కల్యాణమహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా నందివాహనం పై ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నగరోత్సవం నిర్వహించారు. తదుపరి కల్యాణానికి ముందు రాయభార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఎదురుకోలు ఉత్సవం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తదుపరి రాత్రి 10.30 గంటలకు ఉభయదాతల సమక్షంలో దుర్గగుడి ఈవో చంద్రకుమార్ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వరుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కల్యాణోత్సవాలలో వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, కోటా ప్రసాద్ లు, వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
News Posted: 9 April, 2009
|