ఎంబిఏ విద్యార్ధినులు మృతి
విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ సందర్శనం కోసం వచ్చిన హైదరాబాద్ కు చెందిన ఎంబిఏ విద్యార్ధులు రోడ్డు ప్రమాద బారిన పడ్డారు. ఈ సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేటు దగ్గర రెయిలింగ్ పక్కనున్న విద్యార్ఝినులపై నుండి గాజువాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వారిపే దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఎంబిఏ విద్యార్ధులు రాధిక, శార్వాణి, పద్మావతి అక్కడికక్కడే మృతిచెందగా మరో విద్యార్ధిని పరిస్ధితి విషమంగా ఉంది. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహించిన విద్యార్ధులు ఆ సంఘటనా స్థలం వద్ద రాస్తోరకో నిర్వహించారు. దాంతో ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. స్టేల్ ప్లాంట్ సందర్శనానికి వెళ్లిన తమ బిడ్డలు మృత్యువాత పడటంతో ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది.
News Posted: 11 April, 2009
|