విజయవాడ : ఎంతో నమ్మకంగా ఖాతాదారులకు నమ్మకం కలిగించిన ఓ చిట్ ఫండ్ కంపెనీ వినియోగదారులను చీట్ చేసింది. విజయవాడలోని బందర్ రోడ్డులో శ్రీలత అపార్ట్ మెంట్స్ లో శ్రీసాయిలత చిట్ ఫండ్ కంపెనీ తన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఖాతాదారులకు నమ్మకం కలిగించింది. దాంతో పెద్ద మొత్తంలో చిట్ ఫండ్ కంపెనీలో ఖాతాదారులు పెట్టుబడి పెట్టారు. సంస్థ నష్టాలను చూపిస్తూ బోర్డు తిప్పేయడంతో ఖాతాదారులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.