నూజివీడు : ఏలూరు లోక్ సభ నియోజకవర్గ ప్రజారాజ్యం అభ్యర్థి కేపీ రెడ్డయ్యకు ప్రచారంలో అపశ్రుతి ఎదురైంది. నూజివీడు సెగ్మంట్ అభ్యర్థి విజయనిర్మలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బత్తులవారిగూడెం చేరుకోగానే యాదవ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పీఆర్పీ వాహనాలను అడ్డుకున్నారు. మీకు ఎందుకు ఓటేయ్యాలి. ఏనాడైనా యాదవుల బాగోగులు పట్టించుకున్నారా? ఈ రోజు సామాజిక న్యాయం అంటూ వచ్చారా? అని రెడ్డయ్యను నిలదీశారు. మా బాగోగులు పట్టించుకోకుండా ఇప్పుడు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారా అంటూ నిలదీశారు.