లారీ, ఆటో ఢీ:నలుగురి మృతి
విజయవాడ : కృష్ణాజిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనపరాజు పర్వకు చెందిన ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి దూసుకుని రావడంతో తప్పించబోయిన ఆటో బోల్తా కొట్టింది. ఆ సమయంలో లారీ డ్రైవర్, క్లీనర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పది రోజుల పసి కందు మాత్రం క్షేమంగా ఉన్నది.
News Posted: 14 April, 2009
|