`తానా'కు విరివిగా విరాళాలు
చికాగో: 17వ తానా మహాసభల కార్యనిర్వాహక సంఘం ఆధ్వర్యంలో ఫైనాన్స్ కమిటీ ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం చికాగో వాటర్ఫర్డ్ బాంక్వెట్ హాలులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. చికాగో, తదితర ప్రాంతాల తెలుగు మిత్రులు, తానా సభ్యులు అనేకమంది హజరయ్యారు.
ఫైనాన్స్ కమిటీ అధ్యక్షురాలు గవని ఉమాదేవిగారు అతిధి, ఆహూతులనుద్దేశించి మాట్లాడుతూ తానా సమావేశాలు అధిక వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని కేవలం రెజిస్ట్రేషన్ ద్వారా సమకూడే ఆర్ధిక వనరులు పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమాలకు ఏమాత్రం సరిపోవు కాబట్టి ప్రత్యేకంగా స్వఛ్ఛంద విరాళాలు సేకరించవలసిన అవసరం గత 16 తానా సమావేశాల నిర్వహణ అనుభవంలో తెలిసిన సత్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శి, ఇంకా ఇతర తానా కార్యవర్గ సభ్యుల సహకారంతో అమెరికాలోని ముఖ్య పట్టణాలలోని తానా శ్రేయోభిలాషుల నుండి విరాళాలు సేకరించే ప్రణాళిక తయారు చేయబడుతున్నది.
ఇప్పటివరకు దేశం నలుమూలలనుండి $500000 డాలర్లకు పైగా నిధులు లభించాయని సభికుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ఐతే మన ఖర్చుల అంచనా మేరకు ఇంకా ప్రయత్నాలు కొనసాగాలని అందరి సహకారం కోరారు. ఇంత తక్కువ సమయంలో ఇంత మొత్తం సమకూడటం అపూర్వమని, అందుకు ఉమాదేవిగారి కార్యదక్షత, నాయకత్వమే ముఖ్య కారణమని తానా అధ్యక్షులు కాకరాల ప్రభాకర చౌదరి, కార్యదర్శి తొటకూర ప్రసాదు, కన్వీనర్ యడ్లపాటి యుగంధర్ కొనియాడారు.
Pages: 1 -2- -3- News Posted: 17 April, 2009
|