విజయవాడ : ఈనెల 25 నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతున్నట్లు డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో ఉదయం 9 గంటలనుండి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. వీటి వివరాలకోసం ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ లో సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు.