పవన్ పర్యటన రద్దు
విజయవాడ : యువరాజ్యం అధ్యక్షుడు పవన్ పర్యటన రద్దు కావడంతో ప్రజారాజ్యం కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. గుంటూరు పర్యటనలో అస్వస్థతకు గురైన పవన్ చికిత్స నిమిత్తం విజయవాడ చేరుకున్నారు. నేడు ఆయన విజయవాడలో పర్యటించాల్సి వుంది. కాగా, అనారోగ్యం కారణంగా పవన్ ఈ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఆర్పీ 165 సీట్లను గెలుచుకుని తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
News Posted: 20 April, 2009
|