విశాఖలో ఈదురు గాలులు
విశాఖపట్నం : మండే ఎండల నడుమ ఒక్కసారిగా మబ్బులు పట్టి ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో పట్టణమంతాబెంబేలెత్తి పోయింది. విశాఖపట్నంలో గురువారం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. పక్వానికి వచ్చిన మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల అరటి పంట, చెరుకు తోటలు, తమలపాకు తోటలు, వరి కుప్పలకు నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల భవనాలపై రేకులు ఎగిరిపోయాయి. నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయంలో ఉన్న ఒక భారీ వృక్షం నేల కూలింది. అబీద్ సెంటర్లో ఉన్న ఒక చింతచెట్టు పడిపోయింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వివిధ చోట్ల భారీ వృక్షాలు పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
News Posted: 24 April, 2009
|