'శ్రీశ్రీ' శత జయంతి వేడుకలు
విశాఖపట్నం : అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న కవులకు ఏమాత్రం తీసి పోని 21వ శతాబ్దపు తెలుగు మహాకవి శ్రీశ్రీ. నేటి నుంచి విశాఖలో శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మహా కవి శత జయంతిని ఈ సంవత్సరమంతా వేడుకగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని పలు సాహితీ, సాంస్కృతిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. నేటి తరానికే కాక భావితరాలకూ శ్రీశ్రీ స్పూర్తిని సజీవంగా అమేయ శక్తిగా అందించేందుకు వారు నడుం బిస్తున్నారు. మహాకవి పుట్టి, పెరిగి విద్యాబుద్ధులు నేర్చి, మహా ప్రస్థానం వంటి విఖ్యాత ప్రబోధ గీతాల్ని రచించిన విశాఖపట్నం - వేదికగా ఏప్రిల్ 30 నుండి మే 3వ తేదీ దాకా నాలుగు రోజుల పాటు 'శ్రీశ్రీ శత సాహిత్య జయంతి ఉత్సవాలు' నిర్వహించేందుకు ఏయూ తెలుగు శాఖతో కలిసి మొజాయిక్ సాహితీ సంస్థ, ఎస్కేఫౌండేషన్ సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు.. 'నా శాశ్వత చిరినామా విరసం' అంటూ శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్న విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలోనూ ఆయన శత జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.
News Posted: 30 April, 2009
|