బోర్డు తిప్పిన మార్కెటింగ్ సంస్థ
విశాఖపట్నం : కస్టమర్లు, సిబ్బందికి నెత్తిన శఠగోపం పెట్టిందో మార్కెటింగ్ సంస్థ. వెంకట సాయి కృష్ణ మార్కెటింగ్ సంస్థ పేరుతో విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఏర్పాటైన ఈ సంస్థ అకస్మాత్తుగా బిచాణా ఎత్తేసింది. సంస్థలో సుమారుగా మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల జీతాల కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స కావడంతో ఈ మోసం బహిర్గతం అయింది. తమ జీతాల చెక్కులు బౌన్స్ అయిన నేపథ్యంలో వారు యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సంఘటనతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టాడు. దీనితో సంస్థ కార్యాలయం వద్ద సిబ్బంది, కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు.
News Posted: 30 April, 2009
|