రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయవాడ : బందర్ రోడ్డులోని కానూరు వద్ద పెళ్ళిబృందంతో వస్తున్న లారీని వరి పంటను కోసే యంత్రం ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురి పరిస్థితి విషయమంగా ఉంది. వీరంతా మచిలీపట్నంలోని చిన్నాపురంలో వివాహ వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కునికిపాడుకు చెందినవారుగా గుర్తించారు. గాయపడిన వారిని ప్రభత్వాసుపత్రికి తరలించారు.
News Posted: 4 May, 2009
|