పన్నెండు మంది దుర్మరణం
విశాఖపట్నం : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుండి శ్రీకాకుళం జిల్లాకు గాజుల పలకల లోడుతో వస్తున్న లారీ లోయలోకి బోల్తా పడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఎస్.రాయవరం అడ్డరోడ్డు వద్ద ఐదో నెంబరు జాతీయ రహదారిపై తెల్లవారుఝామున 4-30గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్ల గ్రామాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ప్రమాద సమయంలో లారీపై మొత్తం 22 మంది ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తుతో ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాదవశాత్తూ మరణించినవారిలో పెద్దలు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారయ్యారు. గాయపడిన వారిని యలమంచిలి, నక్కపల్లి ఆస్పత్రులకు తరలించారు.
News Posted: 6 May, 2009
|