విశాఖపట్నం : అన్నకాపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన కిషోర్ పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయాడు. కార్యాలయంలో జరిపిన రాసలీలల వ్యవహారం వెలుగులోకి రావడంతో కిషోర్ ను అరెస్ట్ చేయాలని టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్షం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. అలానే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు కూడా స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో 20 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కిషోర్ తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు.