విజయవాడ : పట్టణ ప్రజలకు రక్షిత మంచినీరు అందించే సమ్మర్ స్టోరేజి ట్యాంకులో రెండు గుర్తు తెలియని యువకుల శవాలు తేలుతూ కనిపించాయి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదే చెరువులోని నీరు ఫిల్టరేషన్ ప్లాంటులకు చేరి శుద్ధి అయ్యి ఎలివేటెడ్ రిజర్వాయర్లకు పంపింగ్ జరిగిపోయింది. తదుపరి మున్సిపల్ డి.ఇ.మల్లాది వెంకటరామశాస్త్రి దృష్టికి ఈ విషయం వెల్లడంతో చెరువు నుంచి నీటి లిఫింగ్ ను నిలిపివేశారు. తదుపరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఈరోజు శవాలను వెలికి తీశారు.