విశాఖలో ఏసీబీ దాడులు
విశాఖపట్టణం : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ప్రభుత్వాధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. విశాఖ జిల్లా, యలమంచిలి సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సిఐ) మల్ల మహేష్ ఇంటిపై, శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖాధికారి చౌదరి పురుషోత్తమనాయుడు నివాసంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి విలువైన డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
News Posted: 12 May, 2009
|