విజయవాడ : పటమట న్యూ పోస్టల్ కాలనీకి చెందిన నల్లమోతు అరవింద్ స్నేనితుని పుట్టిన రోజునాడు సరదాగా గపడిపేందుకు స్నేహితులతో సూర్యలంక బీచ్ సముద్ర స్నానానికి వెళ్ళి అలల తాకిడికి మునిగిపోయాడు. కోనేరు లక్ష్మయ్య అనే కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అరవింద్ ఇంటి సమీపంలో వుండే స్నేహితుడి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు గుంటూరు జిల్లా సూర్య లంక బీచ్ కు వెళ్ళారు. సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అల విరుచుకుపడడంతో అరవింద్ తో పాటు మరో స్నేహితుడు సముద్రంలో మునిగిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు వారిని కాపాడారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలో వున్న అరవింద్ మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ప్రమాదంలో చిక్కుకున్న మరో స్నేహితుడు కోలుకున్నాడు. అరవింద్ మృతదేహాన్ని సూర్యలంక నుండి న్యూ పోస్టల్ కాలనీలోని ఇంటికి తీసుకువెళ్ళారు. పార్టీకి వెళ్ళిన తమ ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేని తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.