చలం 115వ జయంతి
విశాఖపట్నం : వచన రనచలో ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం 115 జయంతి ఉత్సవాలను నేడు విశాఖలోని ద్వారకానగర్ - పౌర గ్రంధాలయంలో సాయంత్ర 6 గంటలకు నిర్వహించనున్నారు. నగరంలోని చలం సాహిత్యాభిమానులంతా `చలం ఫౌండేషన్' పేరిట ఒక సాహిత్య సేవాట్రస్టును ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సాహిత్యాన్ని భావితరాలకు అందించడం ట్రస్టు ప్రధాన లక్ష్యమని కార్యదర్శి, రచయిత్రి జగద్దాత్రి వెల్లడించారు. చలం పేరిట ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
News Posted: 18 May, 2009
|