విశాఖపట్నం: మాచ్ ఖండ్ లో మావోయిస్టులు మరోమారు విధ్వంసానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా మాచ్ ఖండ్ సమీపంలోని ఓ సెల్ టవర్ ను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు. ఆంధ్రా - ఒరిస్సా ప్రభుత్వాల దమనకాండకు నిరసనగా మావోలు రెండు రోజుల బంధ్ కు పిలుపునివ్వడంతో జనజీవనం స్తంభించింది.