టీచర్లపై విద్యాశాఖ కొరడా
విజయవాడ : ఉన్నత పదవుల కోసం నకిలీ సర్టిఫికెట్లను సమర్పించిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మచిలీపట్నంలో 33 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఫిర్యాదులు రావడంతో వీరిపై విచారణకు డిఈఓ ఆదేశించారు. ఆరోపణలు రుజువు కావడంతో, నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ప్రమోషన్లు పొందినవారికి రివర్షన్లు ఇవ్వాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు.
News Posted: 20 May, 2009
|